బాబు ఎందుకు రానున్నారో తెలుసా..?
శ్రీ సత్యసాయి బ్యూరో, అక్టోబర్ 30( ఆంధ్రప్రభ): శ్రీ సత్యసాయి జిల్లా (Sri Sathya Sai district) కదిరి నియోజకవర్గం తలుపుల మండలంలో ఎన్.టీ.ఆర్ పింఛను పంపిణి కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్నట్లు సమాచారం. ప్రతినెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఏదో ఒక జిల్లాలోని నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా ఈ నవంబర్ ఒకటో తేదీకి పెన్షన్ల పంపిణీ కోసం కదిరి నియోజకవర్గం(Kadiri Constituency) లోని తలుపుల మండల పరిధిలో జరిగే కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కానున్నట్లు తెలిసింది. అయితే అధికారికంగా ముఖ్యమంత్రి పర్యటన ఖరారు కావాల్సి ఉంది.

