Divvela Madhuri | ఫామ్‌హౌజ్ పార్టీపై ఎస్ఓటీ దాడి

Divvela Madhuri | ఫామ్‌హౌజ్ పార్టీపై ఎస్ఓటీ దాడి
- మద్యం.. హుక్కా స్వాధీనం
- దివ్వెల మాధురి జన్మదినం సందర్భంగా పార్టీ ఏర్పాటు
- వైసీపీ నేతలతోపాటు 22 మంది పాల్గొన్నట్లు గుర్తించిన పోలీసులు
- దివ్వెల మాధురి, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌లకు నోటీసులు
Divvela Madhuri | మొయినాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లో వ్యాపారం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ వైసీపీ శాసనమండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్‌తోపాటు ఆయన భార్య బిగ్‌బాస్ కంటెస్టెంట్ దివ్వెల మాధురి(Divvela Madhuri)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దివ్యెల మాధురి జన్మదినం సందర్భంగా గురువారం రాత్రి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు రెవెన్యూలోని ఓ ఫాంహౌస్‌లో పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైసీపీ నేతలు హాజరయ్యారు. అలాగే అనుమతి లేదని గుర్తించిన రాజేంద్రనగర్ ఎస్ఓటీ(Rajendranagar SOT) పోలీసులు దాడులు నిర్వహించారు.

మద్యం.. హుక్కా స్వాధీనం
ఈ దాడిలో మద్యం, హుక్కాను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఫాంహౌస్ యాజమాన్యం(Farmhouse ownership)పై కేసు నమోదు చేసిన ఘటన గురువారం అర్ధరాత్రి మొయినాబాద్ పోలిస్టేషన్ పరిధిలో జరిగింది. ఈ కేసులో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పార్టీలో ఏపీలోని వైఎస్ఆర్సీపీ(YSRCP)కి చెందిన దువ్వాడ శ్రీనివాస్, మాధురిలతో కలిపి దాదాపు 29 మంది పాల్గొన్నారు. ఫాంహౌస్ యాజమాని సుభాష్, సూపర్ వైజర్ తతుద్దీన్ షేక్, హుక్కా సరఫరా చేసిన రియాజ్‌ల పై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే పార్టీలో పాల్గొన్న దువ్వాడ శ్రీనివాస్, మాధురిలను అదుపులోకి తీసుకుని నోటీసులు ఇచ్చి పంపించారు.
