రివార్డులు అందించిన జిల్లా ఎస్పీ…
మక్తల్, ఆంధ్రప్రభ : జిల్లాలో నిషేధిత మత్తు పదార్థాల సరఫరాపై గట్టి పర్యవేక్షణలో భాగంగా ఇటీవల గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకొని నిందితులను జైలుకు పంపిన మక్తల్ సర్కిల్, టాస్క్ ఫోర్స్ పోలీసు(Task Force Police) అధికారులు సిబ్బందిని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ అభినందించి రివార్డులు అందజేశారు.
ఈ రోజు నారాయణ పేట జిల్లా కేంద్రంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మక్తల్ సీఐ రామ్ లాల్(Maktal CI Ram Lal), ఎస్ఐ లు పురుషోత్తం, ఎస్ఎం. నవీద్, హెడ్ కానిస్టేబుల్ గోప్యనాయక్, పిసి లు రాఘవేందర్,రామస్వామి, అశోక్ కుమార్, శ్రీకాంత్, భాను లకు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ రివార్డులు అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… మత్తు పదార్థాలు జిల్లాలో పూర్తిగా అరికట్టడం మా ప్రధాన లక్ష్యం అని అన్నారు. గంజాయి, డ్రగ్స్(Ganja, Drugs) వంటి మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకోవడంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పోలీసులు కష్టపడి బాగా పని చేస్తే రివార్డులు అవే వస్తాయని ఆలాగే నిబద్ధతతో పనిచేయాలని అన్నారు.
ప్రతి పోలీసు సభ్యుడు ప్రజల రక్షణకు కట్టుబడి ఉండి మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్ లు ఉన్నారు.

