District SP | బాంబ్ స్క్వాడ్ విస్తృత తనిఖీలు
District SP | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఆదేశాలతో నూతన సంవత్సరం సందర్భంగా జిల్లాలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు బస్టాండ్, దేవాలయాలు, ప్రార్ధన మందిరాలు వట్టెం టెంపుల్, పాలెం టెంపుల్ నాగర్ కర్నూల్ టౌన్ లో (Kurnool Town) ఉన్న హౌసింగ్ బోర్డ్ కాలనీ, అలాగే అన్ని ఏరియాలలో ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలో భాగంగా జిల్లా వ్యాప్తంగా బాంబ్ డిస్పోసల్ టీంతో విస్తృత తనిఖీలు చేపట్టామని అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈసందర్భంగా డిసెంబర్ 31 అర్ధరాత్రి జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని, ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని జిల్లా అడిషనల్ ఎస్పీ కోరారు.



