District SP | తెలియని లింకులు క్లిక్ చేయొద్దు

District SP | తెలియని లింకులు క్లిక్ చేయొద్దు

  • ప్రమాదం లో పడొద్దు
  • నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల

District SP | తిరుమల ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సైబర్ అవగాహన పోస్టర్లను జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఆవిష్కరించారు. సైబర్ నేరాలు రోజు రోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో అప్రమత్తత పెంచడం లక్ష్యంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో “ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్” అనే ప్రత్యేక సైబర్ అవగాహన కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించే పోస్టర్‌ను జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్ విడుదల చేశారు.

ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… మీ వ్యక్తిగత సమాచారాన్ని, ముఖ్యంగా పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ వివరాలు, ఓటిపిలను ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. అపరిచిత లింక్‌లపై క్లిక్ చేయవద్దని, ఫోన్ ద్వారా వచ్చిన అటాచ్‌మెంట్‌లను తెరవవద్దని సూచించారు. డిజిటల్ అరెస్ట్, బెదిరింపుల గురించి భయపడవద్దన్నారు. డబ్బును బదిలీ చేయమని లేదా నగదు తీసుకుని ఇవ్వమని కోరే ఇటువంటి అభ్యర్థనలను విశ్వసించవద్దని పేర్కొన్నారు. మీరు ఏదైనా మోసానికి గురైనట్లు భావిస్తే, వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు లేదా 1930 లేదా tgcsb.police.gov.in వెబ్ సైట్ లో ఉన్న చాట్ బాట్ కు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పోస్టర్ విడుదల కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఇంచార్జి వెంకట రమణ, ఆర్.ఎస్.ఐ శ్రావణి, సైబర్ క్రైమ్ సిబ్బంది ఉన్నారు.

Leave a Reply