జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరావు కితాబు

జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరావు కితాబు
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : రక్తదానం(blood donation)లో యువతులు స్ఫూర్తిదాయకంగా నిలిచారని, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరావు అన్నారు. జాతీయ సేవా పధకంలో భాగముగా స్థానిక ఎల్ఐసి(LIC) కార్యాలయం వద్దగల కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో బుధవారం మెగా రక్తదాన శిబిరాన్నిబుధవారం నిర్వహించారు.
ముఖ్య అతిధిగా పాల్గొన్నజిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరావు, రెడ్ క్రాస్ చైర్మన్ పీ.జగన్ మోహన్ రావు(P. Jagan Mohan Rao), జిల్లా వైద్యాధికారి(Medical Officer) అనిత లతో కలసి, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ, అన్నిదానాలలో, రక్తదానం మిన్నఅని, రక్తదాన ప్రాముఖ్యత ఏంటో విద్యార్థినులకు వివరించారు.
శ్రీకాకుళం జిల్లాలో రక్తం అవసరం ఉన్నపేషెంట్లకు రక్త కొరత ఎక్కువగా ఉందని, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్(Swapnil Dinakar Pundkar) సూచనల మేరకు, ప్రతీ కళాశాలలో రక్తదాన శిబిరాలను నిర్వహించి, ఎంతో మంది ప్రాణాలను కాపాడటంలో భాగమౌతున్నారన్నారు.
జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్ మోహన రావు, జిల్లా వైద్యాధికారి అనితలు మాట్లాడుతూ ఈ రక్తదాన శిబిరానికి కళాశాల యాజమాన్యంతోపాటు, డైరెక్టర్ బీఎస్.చక్రవర్తి(BS Chakraborty), ప్రిన్సిపాల్ కె.శివశంకర్ పూర్తి సహాయ సహకారాలు అందించారని, ముఖ్యంగా పురుషులకు దీటుగా, విద్యార్థినులు ముందుకు వచ్చి ఇంతమంది ప్రాణాలను కాపాడటం హర్షణీయమన్నారు.
అనంతరం రక్తదానం చేసిన విద్యార్థినులతో పాటు, ఈ రక్తదానంలో పాల్గొని రక్తదానం చేసిన డా.బీ.ఆర్.అంబెడ్కర్(Dr. BR Ambedkar) యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. కళ్లేపల్లి. ఉదయ్ కిరణ్ లకు జ్ఞాపికను, బంగారు పతకాన్ని అందించి, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు.
రక్తధాన్ అమృత మహోత్సవ్ 2.0 లో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కె.వేణు(K. Venu), ఎన్.ఎస్.ఎస్ పీ.వో. ఎస్.హరి మానస, పి. పైడిరాజు, ఏ.పీ.వో డి.జగన్నాధం, ఆర్.రమాదేవి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినిలు, రెడ్ క్రాస్ ప్రతినిధులు జాతీయ యువజన అవార్డు గ్రహీత పెంకి.చైతన్య, జి.రమణ, బి.చిన్మయ రావు, కె.సత్యన్నారాయణ, బీ.జగదీశ్, టెక్నీషియన్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
