District Court | జిల్లా జడ్జికి నియామక పత్రాలు అందజేత…

District Court | జిల్లా జడ్జికి నియామక పత్రాలు అందజేత…
District Court | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా కోర్టు(District Court)లో ఈ రోజు జరిగిన సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులుకు కేంద్ర ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ యాదవ్, అదనపు న్యాయవాదులు నందు నామాజీ, కురుమన్నగౌడ్ కలిసి కేంద్ర ప్రభుత్వం తరఫున తమకు లభించిన నియామక పత్రాలు, సంబంధిత జీవో ప్రతులను అధికారికంగా అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ… నూతనంగా నియమితులైన న్యాయవాదుల(Lawyers)ను అభినందించి, తమ విధులను న్యాయ నియమావళికి అనుగుణంగా, నిష్టతో నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాద మిత్రులు చెన్నారెడ్డి, మల్లికార్జున్, ఎస్. నారాయణ, మాజీ ఏజీపీ సతీష్ గౌడ్, న్యాయవాదులు భరత్ కుమార్, రాజు రెడ్డి, రాములు, రామ్మోహన్, నర్సింలు, వినోద్, దినేష్, లక్ష్మీపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
