Telangana | స్పష్టమైన లక్ష్యంతో ముందుకెళ్లాలి…

Telangana | స్పష్టమైన లక్ష్యంతో ముందుకెళ్లాలి…
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Telangana | నల్గొండ, ఆంధ్రప్రభ : విద్యార్థి దశ (student stage) లో చదువు ప్రధాన లక్ష్యంగా ఉండాలని స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగితేనే బలమైన భవిష్యత్తు నిర్మించుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila Tripathi) విద్యార్థులకు సూచించారు. బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆమె నల్లగొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… చిన్న వయసులోనే క్రమశిక్షణ, సమయపాలన అలవర్చుకోని రోజుకు నిర్దిష్ట సమయం చదువుకు కేటాయించాలని, సోషల్ మీడియా (Social media) మొబైల్ ఫోన్, ఇంస్టాగ్రామ్ ల వినియోగాన్ని పరిమితం చేయాలని, పుస్తక పఠనం ద్వారా నైపుణ్యాభివృద్ధి ఉన్నత లక్ష్యాలు నిర్ణయించి వాటిని సాధించే దిశగా ప్రతిరోజు కృషి చేయాలన్నారు. ఆడపిల్లలు మగ పిల్లల కంటే తక్కువ కాదని, భయపడాల్సిన అవసరం లేదని,ధైర్యంగా ఉండాలన్నారు.
చదువుకుంటే డాక్టర్లు (Doctors), కలెక్టర్లుగా,తయారు కావచ్చని, మనసులో ఏది బలంగా అనుకుంటే ఆ విధంగా తయారవ్వవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వై అశోక్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, కళాశాల ప్రిన్సిపల్ సుధారాణి. సి డబ్ల్యుసి చైర్మన్ చింత కృష్ణ, చైల్డ్ వెల్ఫేర్ సంస్థ నాగ సేన రెడ్డి, డి సి పి ఓ గణేష్,సరిత, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
