జిల్లాలో జస్టిస్ జువైనల్ బోర్డు ప్రారంభం

జిల్లాలో జస్టిస్ జువైనల్ బోర్డు ప్రారంభం

  • జువైనల్ జస్టిస్ బోర్డును వినియోగించుకోవాలి
  • జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.హెచ్. రమేష్ బాబు

జయశంకర్ భూపాలపల్లి, ఆంధ్రప్రభ ; బాలల హక్కుల పరిరక్షణకు, వారికి సంబంధించిన న్యాయ వ్యవహారాల వేగవంతమైన పరిష్కారానికి కీలకమైన అడుగుగా జువైనల్ జస్టిస్ బోర్డు (జె.జె.బి.)ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.హెచ్. రమేష్ బాబు శనివారం ప్రారంభించారు. జిల్లా న్యాయస్థానం మరియు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భూపాలపల్లి పట్టణంలోని ప్రెస్ క్లబ్ సమీపంలో నూతనంగా ఈ బోర్డును ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, బాలలకు సంబంధించిన న్యాయపరమైన కేసులు, సమస్యలను సత్వరంగా పరిష్కరించేందుకు జె.జె.బి. కీలక వేదికగా నిలుస్తుందని తెలిపారు. జిల్లా ప్రజలు ఈ బోర్డును సమర్థంగా వినియోగించు కోవాలని సూచించారు. జె.జె.బి. ఇన్‌ఛార్జిగా ములుగు జిల్లా ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి జి. జ్యోత్సను నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఏ. నాగరాజ్, సంక్షేమ అధికారి మల్లేశ్వరి, గవర్నమెంట్ ప్లీడర్ బోట్ల సుధాకర్, అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి. శ్రావణ్ రావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏదులాపురం శ్రీనివాస్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ పుప్పాల శ్రీనివాస్, అదనపు, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లు బల్లా మహేందర్, ఇందారపు శివకుమార్, బోర్డు సభ్యులు మెరుగు సుభాష్, రమణ మూర్తి, సీనియర్ న్యాయవాదులు కూనూరి సురేష్ కుమార్, పగడాల ఆనందరావు, మంగళపల్లి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply