కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ…

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ…
బిచ్కుంద, ఆంధ్రప్రభ : సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు(Jukkal MLA Thota Lakshmi Kantha Rao) అన్నారు. బిచ్కుంద మండల కేంద్రంలోని కళ్యాణ లక్ష్మి చెక్కులను ఈ రోజు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు వంతుల వారిగా సంక్షేమ పథకాలు అందిస్తూ ఆదుకుంటుందని ఆయన అన్నారు. ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ విద్యుత్ సరఫరా(Indiramma’s house, 200 unit electricity supply), గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై పలు పథకాలను అందజేస్తుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ డెలివరీ విట్టల్ రెడ్డి, మాజీ డీసీసీబీ డైరెక్టర్ పుల్కల్ వెంకట్రామిరెడ్డి, పుల్కల్ సొసైటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, బిచ్కుంద మండల పార్టీ అధ్యక్షుడు ధర్పల్లి గంగాధర్, మైనార్టీ నాయకులు ఖలీల్, తెలంగాణ పార్టీ ఉద్యమకారుడు అసద్ అలీ, తదితరులు పాల్గొన్నారు.
