SAREES | కన్నెపల్లి మండలంలో ఇందిరమ్మ చీరల పంపిణీ

SAREES | కన్నెపల్లి మండలంలో ఇందిరమ్మ చీరల పంపిణీ

SAREES | బెల్లంపల్లి (ఆంధ్రప్రభ): కన్నెపల్లి మండలంలోని కన్నెపల్లి, గొల్లగట్టు, పోలంపల్లి గ్రామాల్లో ఆదివారం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సూచనల మేరకు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాధవరపు నర్సింగరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కన్నెపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పప్పుల రామాంజనేయ (Congress President Pappula Ramanjaneya) చీరలను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ బెల్లంపల్లి నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ఏల్పుల రోహిత్, సీనియర్ కాంగ్రెస్ నేతలు శ్రీహరి, మాజీ జడ్పీటీసీ కౌటారపు సత్యనారాయణ, బట్టు శ్రీనివాస్, తనుగుల శంకర్, అంజన్న, పెద్దన్న. మాజీ ఉపసర్పంచులు గడ్డల వెంకటేష్, వెంకన్న, గణపతి బానేష్, సత్తీష్ గుప్త, పెట్టం సురేష్, రాజు, బోరిగాం జలపతి, కొత్తకొండ సంతోష్, ప్రశాంత్, రాదండి రాజు, తిరుపతి, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply