distribution | స్టడీ మెటీరియల్‌ పంపిణీ

distribution | స్టడీ మెటీరియల్‌ పంపిణీ

  • ఎస్టీయూ గుడివాడ శాఖ ఆధ్వ‌ర్యంలో విద్యార్థుల‌కు అంద‌జేత‌

distribution | గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ ఎస్టీయూ శాఖ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్నిగుడివాడ ఎస్పీఎస్ పాఠశాలలో సోమవారం ఉదయం నిర్వహించారు. ఎంఈఓలు సీహెచ్ రజిని, బాలాజీ నాయక్ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించారు. పదవ తరగతిలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించడంలో ఎస్టీయూ అందించిన మెటీరియల్స్ విద్యార్థులకు ఎంతగానో దోహదపడతాయని ఎంఈఓలు అన్నారు.

గుడివాడ టౌన్‌లోని మున్సిపల్ పాఠశాలల్లోని విద్యార్థులు అత్యధిక శాతం మంది ఉత్తమ ఉత్తీర్ణత సాధించేందుకు అన్ని విధాలుగా చర్యలు చేపట్టినట్లు అధికారులు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర అదనపు కార్యదర్శి చంద్రశేఖర్, జిల్లా నాయకులు టీవీఎండీ ప్రసాద్, అరవింద్, ప్రకాష్ బాబు, విజయ్ కుమార్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు డానియల్, పరస శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply