distribution | రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ..

distribution | పమిడిముక్కల – ఆంధ్రప్రభ : కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీ భూమి హక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం, 1971 – రీసర్వే చేసిన గ్రామాలలో రాజకీయ పార్టీల లోగోలు, పేర్లను తొలగించి ప్రభుత్వ చిహ్నంతో కొత్త పాస్ పుస్తకాలను కూటమి ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. ఈ రోజు పమిడిముక్కల మండలంలోని అగినపర్రు గ్రామంలో 289 “కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను” పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా చేతుల మీదుగా రైతులకు పంపిణీ చేయడం జరిగినది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 18 నెలలలో అందించిన పధకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, సీనియర్ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply