distribution | విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది..

distribution | విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది..

  • ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు..
  • జెడ్పీ గర్ల్స్ హైస్కూల్లో స్ఫూర్తి భవితకు భరోసా పుస్తకాల పంపిణీ

distribution | తిరువూరు, ఆంధ్రప్రభ : విద్యార్థుల బంగారు భవిష్యత్తుకి పదవ తరగతి చక్కటి పునాది అని తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. తిరువూరు పట్టణంలోని జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు ప్రేరణ స్ఫూర్తి భవితకు భరోసా కార్యక్రమంలో భాగంగా స్టడీ టెక్స్ట్ పుస్తకాలను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పంపిణీ చేశారు.

distribution

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ… పదవ తరగతి విద్యార్థుల జీవితంలో అత్యంత కీలకమైన దశ అని పేర్కొన్నారు. ఇది వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేసే ముఖ్యమైన మెట్టు అని, ఈ సమయంలో విద్యార్థులు చూపించే క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి చదవాలనే సంకల్పమే రేపటి విజయాలకు దారి చూపుతుందని అన్నారు.

విజయం అనేది అదృష్టంపై ఆధారపడినది కాదని, క్రమశిక్షణతో కూడిన నిరంతర శ్రమ ఫలితమేనని స్పష్టం చేశారు. విద్యార్థుల చదువుకు మరింత దోహదపడేలా ఈ స్టడీ మెటీరియల్‌ను అందజేస్తున్నామని పేర్కొంటూ, క్రమం తప్పకుండా చదువుతూ ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ స్వయంకృషితో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.

అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన డైరీని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పట్టణ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply