Distribution | నిరుపేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

Distribution | నిరుపేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

  • భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
  • 77 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

Distribution | ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : నిరుపేదల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శనివారం భూపాలపల్లి మంజూరునగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భూపాలపల్లి, గణపురం మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 77 మంది లబ్ధిదారులకు రూ.22,59,500 విలువైన చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలు, నిరుపేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజల కష్టాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తున్నామని, భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave a Reply