Distribution | ఆడబిడ్డలకు భరోసాగా కల్యాణ లక్ష్మి పథకం

Distribution | ఆడబిడ్డలకు భరోసాగా కల్యాణ లక్ష్మి పథకం
- 49మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ
- మార్కెట్ చైర్మన్ వెంకటయ్య, తహసీల్దార్ వీరాబాయి
Distribution | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : వేద కుటుంబాల ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం భరోసాగా ఉంటుందని చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య తెలిపారు. చౌటుప్పల్ పట్టణంలోని జయశ్రీ గార్డెన్ లో ఇవాళ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల తహసీల్దార్ వీరాబాయి, మార్కెట్ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డిలతో కలిసి చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 9 వార్డులకు చెందిన 17మంది లబ్ధిదారులకు, మండలంలోని మందోల్లగూడెం, కొయ్యలగూడెం, మల్కాపురం, ఆరెగూడెం, ఎస్ లింగోటం, నేలపట్ల, కుంట్లగూడెం, అంకిరెడ్డి గూడెం, పంతంగి, పెద్ద కొండూరు, జై కేసారం తదితర 17 గ్రామాలకు చెందిన 32 మందికి ఒక్కొక్కరికి రూ. 1,00,116 లు చొప్పున మొత్తం 49 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్ఐలు బాణాల రామ్ రెడ్డి, కొప్పుల సుధాకర్ రావు, సర్పంచులు తంగెళ్ళ వెంకటేశం, భీమిడి ప్రదీప్ జీ, గంగాపురం వసంత నాగేష్ గౌడ్, గుండెబోయిన శిరీష ఇస్తారి యాదవ్, ఉప సర్పంచ్ శ్రీధర్ రెడ్డి తదితర సర్పంచులు, ఉపసర్పంచ్ లతో పాటు వివిధ పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
