డిపార్ట్ మెంట్‌ చీఫ్ అధికారులు పాల్గొనాలి…

డిపార్ట్ మెంట్‌ చీఫ్ అధికారులు పాల్గొనాలి…

పదో తరగతి పరీక్షలు ప్రశాంతం..
63 పరీక్ష కేంద్రాలు ఆకస్మిక తనిఖీలు..
మాస్ కాఫీయింగ్ కు ఆస్కారం లేదు..
పరీక్షల రాష్ట్ర అబ్జర్వర్ సమగ్ర శిక్ష స్టేట్ డైరెక్టర్ అనురాధ..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రెండవ రోజు హిందీ పరీక్ష బుధవారం ప్రశాంతంగా నిర్వహించారు . ప్రతిరోజు నిర్వహించే పరీక్షల సెట్ కాన్ఫరెన్స్ లో చెప్పిన విషయాలను ఆయా పరీక్షా కేంద్రాల చీఫ్లు డిపార్ట్మెంట్ల అధికారులు నిబంధనలు, సూచనలు కచ్చితంగా పాటించాలని, ప్రశ్నపత్రం ఇచ్చే విషయంలో ప్రభుత్వం ఇచ్చిన కోర్టు ప్రకారమే విద్యార్థులకు ప్రశ్నాపత్రాన్ని విద్యార్థులకు అంద చేయాలని ఏమాత్రం తేడా వచ్చిన వారే బాధ్యులవుతారని పరీక్షల రాష్ట్ర అబ్జర్వర్ సమగ్ర శిక్ష స్టేట్ డైరెక్టర్ ఎం. అనురాధ పేర్కొన్నారు.

10వ తరగతి పబ్లిక్ పరీక్షల సెట్ కాన్ఫరెన్స్లో పట్టణంలోని మూడో పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించారు. సెట్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర అబ్జర్వర్ అనురాధ డిపార్ట్మెంటల్ చీఫ్ సూపర్డెంట్ అధికారులకు ముఖ్యమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చీఫ్ సూపరెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లతో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లకు ప్రతిరోజు తప్పకుండా 8 గంటలకు హాజరుకావాలని సెట్ కాన్ఫరెన్స్ ముగిసిన తర్వాత లాక్ తీసి ఎగ్జామ్స్ పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేయలని వారిని కోరారు.

అదేవిధంగా జిల్లాలో పరిధిలోని పనిచేయుచున్న వివిధ సెంటర్ల చీప్ సూపరెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లతో మాట్లాడుతూ సెంటర్ నందు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి సబ్జెక్టులోని పేపర్ కోడు ప్రకారం చూసుకొని విద్యార్థులకు చాలా జాగ్రత్తగా ఎగ్జాం పేపర్స్ డిస్ట్రిబ్యూషన్ చేయవలసిందిగా ఆదేశించారు. ఎవరైనా నిబంధనలకు రూల్స్ కు విరుద్ధంగా అతిక్రమిస్తే ప్రభుత్వ యాక్ట్ చట్టం సెక్షన్ 25 ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ కస్టోడియన్ నాగరాజు జాయింట్ కస్టోడియన్ సురేష్ నాయుడు జిల్లాలోని అన్నిసెంటర్ల చీప్ సూపర్డెంట్లు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. జిల్లాలోని 130 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు విద్యార్థులకు అన్ని వసతి సౌకర్యాలతో ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్న రు. హిందీ పరీక్షకు 24707 నంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు 24438 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షకు 98.81 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.269 జట్లు గైర్హాజరయ్యా రు. రాష్ట్ర అబ్జర్వర్ అనురాధ పది పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.

పాణ్యం నందివర్గం, బనగానిపల్లె, తో పాటు పలు కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 63 పరీక్షా కేంద్రాలను 6 ఫ్లయింగ్ స్క్వాడ్, సెట్టింగ్స్ కార్డులు తనిఖీ చేశారు. 70 మందిని సిట్టింగ్ స్క్వాడ్స్ కింద నియమించినట్లు తెలిపారు. నేడు జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక విద్యాపీఠం పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ఇంగ్లీష్ పరీక్షను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య నిర్వహించినట్లు తెలిపారు ఈ పరీక్షలను జిల్లాలోని ఐదు పరీక్ష కేంద్రాల్లో 492 మంది విద్యార్థులకు గాను 461 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు రాష్ట్ర అబ్జర్వర్ అనురాధ తెలిపారు.

Leave a Reply