బీజేపీ బలోపేతానికి కలిసి కట్టుగా కృషిచేయండి….

బీజేపీ బలోపేతానికి కలిసి కట్టుగా కృషిచేయండి….

బీజేపీలో పని చేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం. భాస్కర్.

ఊట్కూర్, ఆంధ్రప్రభ : బీజేపీ పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న వివిధ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుఎం. భాస్కర్, ఊట్కూర్ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్ అన్నారు. సోమవారం బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా నారాయణపేటజిల్లా ఊట్కూర్ బీజేపీ మండలప్రధాన కార్యదర్శిలుగా తారాకృష్ణ , రణవీర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకొని ఘనంగా సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ పార్టీలో పనిచేసినప్రతికార్యకర్తకు తగినసమయంలోవారికిగుర్తింపు లభిస్తుందన్నారు. బీజేపీ పార్టీ క్రమశిక్షణ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటంచేసేపార్టీలో పనిచేసిన ఎంతోమంది కార్యకర్తలుఉన్నతస్థాయిలో ఉన్నారనిగుర్తుచేశారు. ఊట్కూర్ మండలం బీజేపీ పార్టీకి కంచుకోటగా ఉందని ఇటీవల జరిగినసర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారని అన్నారు.

పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎంపీడీకే అరుణ ప్రత్యేక కృషిచేస్తున్నారని కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాలు అభివృద్ధి చేసుకుందామనిఅన్నారు. నూతనంగా మండల ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికైన తారా కృష్ణ, రణవీర్ లు ప్రజలు కార్యకర్తలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. గత కొన్ని ఏళ్ల నుండి పార్టీలో చురుకైన కార్యకర్తలుగా పనిచేయడంతో వారి సేవలను గుర్తించిన బీజేపీ అధిష్టానం పార్టీలో సముచిత స్థానంకల్పించిందనిఅన్నారు.

అనంతరం బీజేపీ శ్రేణులు నూతనంగా ఎన్నికైన రణవీర్ తారాకృష్ణలకు మిఠాయిలు తినిపించి సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రమేష్, బీజేపీ జిల్లా వాణిజశాల్ కన్వీనర్ కృష్ణయ్య గౌడ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఎం భరత్, మాజీ మండల అధ్యక్షులు రమేష్, నాయకులుకుర్వ ఆశప్ప, లక్ష్మణ్, హన్మంతు, కొండన్ గోపాల్, తిమ్మప్ప, భరత్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply