Disasters | కోతులు కూడా..

Disasters | కోతులు కూడా..
Disasters, పెడన, ఆంధ్రప్రభ : పెడన మండలం బల్లిపర్రు గ్రామంలో వర్షానికి తడిచి మొలకెత్తిన ధాన్యాన్ని ఆరబోయగా, గుంపుగా వచ్చిన కోతులు వాటిని చుట్టుముట్టాయి. ‘రాజుల సొమ్ము రాళ్లపాలు’ అన్న చందంగా రైతుల ధాన్యం కోతుల పాలైంది. కోతులను బెదరగొట్టడానికి ప్రయత్నిస్తే మీద పడతాయన్న భయంతో అటుగా వెళ్లేవారు వాటిని ఆపేందుకు సాహసించలేకపోతున్నారు. విపత్తుల నష్టానికి తోడు, కోతులు కూడా రైతుకు నష్టం కలిగిస్తున్నాయి అన్నారు.
