హైదరబాద్, ఆంధ్రప్రభ : సీబీఐ డైరెక్టర్ (CBI Director) ప్రవీణ్ సూద్ అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం శ్రీశైలం నుంచి వస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది జూబ్లీహిల్స్ (Jubilee Hills) లోని అపోలో ఆసుపత్రి (Apollo Hospital) కి తరలించారు.
విషయం తెలిసిన పోలీసు ఉన్నతాధికారులంతా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. వైద్య సిబ్బందితో మాట్లాడి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. నిన్న నగరానికి చేరుకున్న ఆయన హైదరాబాద్ (Hyderabad) జోన్ సీబీఐ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రెండు గంటలకు పైగా సుదీర్ఘంగా చర్చించారు.