Dial 100 | చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు..!

Dial 100 | చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు..!

Dial 100 | మందమర్రి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా మందమర్రి ఎస్సైగా జి.నరేష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన మందమర్రి ఎస్సైగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై నరేష్ మాట్లాడుతూ… శాంతిభద్రతల పరిరక్షణ ధ్యేయంగా పని చేస్తానని చెప్పారు. అదేవిధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తూనే చట్టాన్ని ఉల్లంఘించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తానని ఆయన స్పష్టం చేశారు.

అంతే కాకుండా నిషేధిత గుట్కా, గంజాయి విక్రయాలను అరికడతానని, దాంతోపాటు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, ఈవ్ టీజింగ్ పాల్పడే వారిపట్ల కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై వివరించారు. అదేవిధంగా డయల్ 100 నెంబర్ కు ఫోన్ చేసి పోలీస్ సహాయాన్ని పొందాలని ఎలాంటి సమస్య వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై నరేష్ తెలిపారు. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్లను తనదైన స్టైల్ లో నివారిస్తానని వివరించారు.

Leave a Reply