Dial 100 | హ్యాపీగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోండి…

Dial 100 | హ్యాపీగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోండి…

  • సంతోషాలను విషాధంగా మార్చుకోవద్దు
  • హద్దులు దాటొద్దు…ఆగం కావొద్దు
  • పోలీసు నిఘా, డ్రంకన్ అండ్ డ్రైవ్ టెస్టులు పెంచాం
  • వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్ ప్రీత్ సింగ్

Dial 100 | వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలను నిర్వహించుకోవాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్ ప్రీత్ సింగ్(Commissioner Sunpreet Singh) ప్రజలకు సూచించారు.నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న వేళ వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని ప్రజలు ప్రశాంతవంతమైన వాతవరణంలో ఎలాంటి ఆవాంనీయ సంఘటనలు జరగకుండా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించు కోనేందుకు పలుసూచనలు చేస్తూ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సంప్రీత్ సింగ్ మంగళవారం ప్రకటన విడుదల చేశారు.

డిసెంబర్‌ 31 రాత్రి నిర్వహించుకునే నూతన సంవత్సర వేడుకల సందర్బంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ పరిధిలో స్థానిక పోలీసులతో పాటు ట్రాఫిక్‌, టాస్క్‌ఫోర్స్‌, క్రైమ్‌, షీ టీమ్స్‌తో పాటు పెట్రోలింగ్‌ విభాగాలకు చెందిన పోలీసులు ముమ్మరంగా పెట్రోలింగ్‌(Patrolling) నిర్వహిస్తారన్నారు. ముఖ్యంగా ఈ వేడుకలను ప్రజలు ఆర్థరాత్రి 12.30 గంటల లోపు ముగించుకోవాలని సూచించారు.

ఈ నూతన సంవత్సర వేడుకుల సందర్బంగా ఎర్పాటు చేసే సంస్కృతిక కార్యక్రమాలకు నిర్వహకులు తప్పని సరిగా పోలీసు అధికారుల నుండి ముందస్తూ అనుమతులు తీసుకోవడంతో పాటు, వేడుకలు నిర్వహించుకునే ప్రాంతంలో ఎలాంటి అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అలాగే కార్యక్రమాల నిర్వహణ ప్రదేశంలో తప్పనిసరిగా సిసి కెమెరాల ఏర్పాటు చేయడంతో పాటు సెక్యూరీటీ సిబ్బంది ఎర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు.

ఈ వేడుకలు జరిగే సమయంలో ఎలాంటి ట్రాఫిక్‌ సమస్యలతో పాటు పరిసర ప్రాంతాల్లోని నివాసితులకు ఎలాంటి ఇబ్బందులు,అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో ఎలాంటి మత్తు పదార్థాల వినియోగించడం లాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీస్ కమీషనర్ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు. ప్రధానంగా ఈ వేడుకల వేళ యువకలు మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారకులు కావొద్దన్నారు.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనీఖీల్లో పోలీసులకు చిక్కితే జరిమానతో పాటు జైలు శిక్ష విధించ బడుతుందని వార్నింగ్ ఇచ్చారు. అలాగే వేగంగా వాహనాలు నడపడం, రోడ్లుపై వెళ్ళేవారిని ఇబ్బందికి గురిచేసే విధంగా వ్యవహరిస్తే సదరు వాహనదారులకు చట్టపరమైన తిప్పలు తప్పవని హెచ్చరించారు.రోడ్లపై ట్రాఫిక్‌ సమస్యలు రాకుండా ట్రాఫిక్‌ సిబ్బంది(Traffic Staff)తో పాటు స్థానిక పోలీసుల అధ్వర్యంలో ట్రై సిటితో పాటు, గ్రామీణా ప్రాంతాల్లోను ముమ్మరంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌ తనీఖీలు నిర్వహించబడుతాయన్నారు.

అలాగే ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే విధంగా బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలను నిర్వహిస్తే వారిపై తగు చర్యలు తీసుకొంటామని పేర్కొన్నారు. హద్దు మీరి ఎవ్వరు ప్రవర్తించిన కేసులు తప్పవన్నారు. ఆనందోత్సాహాలతో జరుపు క్కోవాల్సిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను విషాధంగా మార్చుకోవద్దని హితువు చెప్పారు.

పై అంక్షలను ఎవరైన అతిక్రమించిన, ఉల్లంఘించినట్లుగా ప్రజల దృష్టికి వస్తే వెంటనే డయల్ 100(Dial 100) నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. పోలీసులు డయల్ 100 కాల్ కు తక్షణమే స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ వేడుకలను ప్రజలు, యువత తమ ఇండ్లలోనే తమ కుటుంబ సభ్యులతో కల్సి సంతోషకరమైన వాతరణంలో నిర్వహించు కోవాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్ ప్రీత్ సింగ్ ప్రజలకు సూచించారు.

Leave a Reply