DHOOM 3 :  రూ.3 కోట్లు  లూటీ

DHOOM 3 :  రూ.3 కోట్లు  లూటీ

* తెరమీదకు  హవాలా స్టోరీ  

* రూ.4.20 కోట్ల తరలింపు 

 * రూ.3 కోట్ల లూటీ

* ఏపీలో సంచలనం

( శ్రీ సత్యసాయి బ్యూరో,   ఆంధ్రప్రభ) :

సినిమా ఫక్కీలో..  హైటెక్  దోపిడీ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో నిజ జీవితంలో చోటు చేసుకుంది. ధూమ్–3 సినిమా (DHOOM 3 ) తరహాలో కార్లల్లో  (Car Chaging)   చేజింగ్​ దృశ్యాలు.. స్రీన్​ ప్లే ను మరపించాయి.  హవాలా సొత్తును దోచుకునే సన్నివేశాలు పోలీసులను సైతం అబ్బుర పరిచాయి. రూ.4.20 కోట్లలో   రూ.3 కోట్ల నగదును కొల్లగొట్టిన (Rs, 3 Crore)  కిరాయి దొంగలు పరారయ్యారు. బెంగళూరు–హైదరాబాద్  హైవేపై  నయా డాన్​ కథ హైటెన్షన్​ క్రియేట్​ చేసింది.   44వ జాతీయ రహదారిపై, పెనుకొండ – సోమందేపల్లి మధ్య   సోమవారం తెల్లవారుజామున   ఈ దోపిడీ ఏపీలోనే కాదు, గుజరాత్​, కర్ణాటక పోలీసులనూ కంగారెత్తించింది.

 DHOOM 3 : సూరత్ టూ బెంగళూరు వయా ఏపీ

గుజరాత్   సూరత్ నుంచి (From Surath)  ఇద్దరు వ్యక్తులు ఒక ఇన్నోవా కారులో  హవాలా డీల్ (Hawala Deal) ​ నిమ్మిత్తం  రూ.4.20 కోట్ల నగదును ( Rs.4.20 crore)  బెంగళూరుకు తరలిస్తున్నారు. ఈ నగదు అక్రమ మార్గంలో తరలిస్తున్నదనే సమాచారం ముందే కొందరు దుండగుల చెవిన పడినట్లు తెలుస్తోంది.  పక్కా ప్రణాళికతో ఈ డబ్బును దోచుకునే కుట్రకు తెరలేపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

DHOOM 3 : నాలుగు కార్లలో.. చేజింగ్​ … .

సూరత్ నుంచి బయలుదేరిన ఇన్నోవా (Innova Car) కారును  దుండగులు నాలుగు కార్లలో వెంబడించారు. వాహనం ఎక్కడ ఆగినా, దారిలో తీసుకున్న ప్రతి మలుపు గమనిస్తూ, అడుగడుగునా వెంటాడుతూ వచ్చారు. బెంగళూరు – హైదరాబాద్ (Bengalore ..Hyderabad)  ప్రధాన మార్గంలోకి ప్రవేశించిన తరువాత కూడా వేట  కొనసాగింది. ఈ ఘటన మొత్తం సినిమా సన్నివేశాలను తలపించేలా ఉందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

DHOOM 3 : హైవే పై అడ్డగింత.

44వ జాతీయ రహదారిపై సోమందేపల్లి (Somdepalli) – పెనుకొండ Penukonda)  మధ్య ప్రాంతానికి వచ్చేసరికి, దుండగులు తమ ప్లాన్‌ను అమలు చేశారు. ముందుగా ఇన్నోవా వాహనాన్ని చుట్టుముట్టారు.  రోడ్డుపై అడ్డగించి బలవంతంగా కారును నిలిపివేశారు. (Two Persons Detained)   ఇన్నోవాలోని ఇద్దరిని బెదిరించి  కారుతో సహా తమ నియంత్రణలోకి తీసుకున్నారు. అనంతరం ఇద్దరినీ  కిడ్నాప్ చేసినట్టే తీసుకెళ్లి, కారులోని  నగదును (Cash Transferred)  తమ వాహనాల్లోకి మార్చారు.  

 DHOOM 3 : కొన్ని నిముషాల్లోనే.. రూ.3 కోట్ల దోపిడీ…

ఇన్నోవా వాహనంలో ఉన్న మొత్తం రూ.4.20 కోట్లలో రూ.3 కోట్ల నగదును దుండగులు తీసుకెళ్లారు. (With in minutes)  మిగిలిన రూ.1.20 కోట్లను కారులోనే వదిలేసి,  (Left Rs.1.20 crore) హవాలా డబ్బు తరలిస్తున్న ఇద్దరిని, వారి కారును రహదారిపై వదిలేసి పారిపోయారు. ఈ దోపిడీ (remain amount robbery) మొత్తం కొన్ని నిమిషాల్లోనే పూర్తయ్యిందని సమాచారం.

DHOOM 3 : పోలీసుల ఎదుట లబోదిబో

దోపిడీతో భయాందోళనకు గురైన బాధితులు వెంటనే నైట్ పెట్రోల్ విధుల్లో ఉన్న ఎస్ఐను సంప్రదించి ఫిర్యాదు చేశారు. కియా పోలీస్ స్టేషన్ (Kia police Station) పరిధిలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో, అక్కడి పోలీసులు బాధితులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ అప్పటికే దుండగులు వాహనాలతో సహా పరారయ్యారు.

DHOOM 3 : రూ.1.20 కోట్లు స్వాధీనం

పోలీసులు బాధితుల ఇన్నోవా వాహనాన్ని తనిఖీ చేయగా, కారులో రూ.1.20 కోట్ల నగదు (Police Cash Seized) ఉన్నట్టు గుర్తించారు. ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకొని, వాహనంతో పాటు ఇద్దరు బాధితులను (Two victims ) పెనుగొండ పోలీస్ స్టేషన్‌కు (Send to Penukoda PS) తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ రాఘవన్ వెల్లడించారు.

 DHOOM 3 : హవాలా కోణంపై దర్యాప్తు…

ఈ ఘటనలో ప్రధానంగా హవాలా కోణం (Case Hawala Angle)  వెలుగులోకి రావడంతో, నగదు మూలాలు, ఎవరి కోసం ఈ డబ్బు తరలిస్తున్నారు, దుండగులకు సమాచారం ఎలా లీక్(How Leak) అయింది. వంటి అంశాలపై పోలీసులు లోతైన విచారణ చేపట్టారు. గుజరాత్ నుంచి కర్ణాటక వరకు సాగిన ఈ ప్రయాణంలో మధ్యలో ఎవరు సహకరించారనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.

*DHOOM 3సీసీటీవీ పుటేజీలతో  గాలింపు…

దుండగుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు, జాతీయ రహదారి వెంబడి ఉన్న సీసీటీవీ కెమెరాలు , టోల్ గేట్ల( Toll Gates) ఫుటేజ్‌ను (CC Puttage) పరిశీలిస్తున్నారు. నాలుగు కార్లలో వచ్చిన దుండగుల వాహన నంబర్లు, వారి ప్రయాణ మార్గాన్ని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఇతర రాష్ట్రాల పోలీసులతో కూడా సమన్వయం చేసుకుంటున్నారు.

 DHOOM 3 : నాలుగు రాష్ట్రాల్లో  సంచలనం…

పగటి వేళలలో, జాతీయ రహదారిపై, అంత భారీ మొత్తంలో నగదు దోపిడీ జరగడంతో ప్రజల్లో భయభ్రాంతులు నెలకొన్నాయి. (Sensation in Four States) సినిమాల్లో చూసే తరహాలో జరిగిన ఈ ఘటనపై సామాన్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నగదు రవాణా ఎంత ప్రమాదకరమో మరోసారి ఈ ఘటన రుజువు చేస్తోందని పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు.

DHOOM 3 : ఇక మిగిలింది మిస్టరీ

ఈ దోపిడీ వెనుక ఎవరున్నారు? దుండగులకు సమాచారం ఎలా చేరింది? హవాలా నెట్‌వర్క్ (Hawala Network)  ఎంత పెద్దదో? వంటి కీలక ప్రశ్నలకు సమాధానాలు పోలీసు ఉన్నతాధికారుల (Police Investigation ) దర్యాప్తులో వెలుగులోకి రావాల్సి ఉంది. ఈ కేసు పూర్తిగా తేలేవరకు రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ (Tention)  కొనసాగనుంది.

ALSO READ : Fake Break Inspector : అతడే ఇతడు

Leave a Reply