మద్దతుగా ఎమ్మెల్యే గంగుల
ఉమ్మడి కరీంనగర్ బ్యూరో, ఆంధ్రప్రభ : పంటలు పొట్టకొచ్చిన దశలో యూరియా (Urea) వేయకుంటే పంటలు నాశనమవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. యూరియా అందని రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ రోజూ కరీంనగర్ (Karimnagar) రూరల్ మండలం దుర్శేడు గోపాల్పూర్ ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.
సమాచారం అందుకున్న మాజీ మంత్రి, స్థానిక కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (MLA Gangula Kamalakar) వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం తోనే రైతులకు యూరియా అందని పరిస్థితి నెలకొందని అన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులకు కావాల్సిన యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో రాజీవ్ రహదారి (Rajiv Road)పై వాహనాలు భారీగా నిలిచిపోవడంతో పోలీసులు ఎమ్మెల్యేను అరెస్టు చేసి రూరల్ పోలీస్ స్టేషన్ (Police Station)కు తరలించారు

