Dharna | దాడులకు పాల్పడితే స‌హించం

Dharna | నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో బుధవారం రాత్రి సంబంధించిన వ్యక్తులకు డాక్టర్లకు అకారణంగా తిడుతూ ఆసుపత్రి అద్దాలను పగుల కొట్టారు. దీంతో గురువారం ఆస్పత్రి వైద్యులు ధర్నా నిర్వహించారు. ధర్నాలలో జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ బాలాజీ మాట్లాడుతూ.. వైద్యులను భయబ్రాంతులకు గురిచేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పర్శనాయక తండాకు చెందిన పేషెంట్‌కు సంబంధించిన బంధువులు వైద్యులపై ఆరోపణలు చేస్తూ ఆసుపత్రి గేటు అద్దాలను పగుల కొట్టారని తెలిపారు. దాడులకు పాల్పడితే జూనియర్ డాక్టర్లను భయబ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. పర్శనాయక తండాకు చెందిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. కేసు పెడితే వారిపై చర్యలు తీసుకుంటామని సీఐ రఘుపతి రెడ్డి తెలిపారు. ఈ ధర్నాలో ఆసుపత్రి సూపరింటెండెంట్ కిషన్, వైద్యులు విజయ్ పాల్, రుచిత, నవీన్, బాలరాజు, కేశవులు, రాజు, సుధీర్, సిస్టర్స్ పాల్గొన్నారు.

Leave a Reply