Dharna | ఓపిఓల ధర్నా..

Dharna | ఓపిఓల ధర్నా..
రెండు పూటల అన్నానికి ఐదువందలా
8 వద్దు 13 కావాలి
డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద బైఠాయించిన ఓపివోలు
Dharna |జనగామ, ఆంధ్రప్రభ: పనిచేయించుకుని పైసలు ఇవ్వడం లేదంటూ ఎన్నికల విధులు నిర్వహించిన ఓపివోలు బుధవారం డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద ధర్నా నిర్వహించారు.మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా జనగామ జిల్లా కేంద్రంలోని 30 పోలింగ్ కేంద్రాలకుగా 200 మంది ఓపిఓలు విధులు నిర్వహించగా వారికి చెల్లించవలసిన డబ్బులలో కోత పెడుతున్నారంటూ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. గత స్థానిక సంస్థ ఎన్నికలలో భోజనం పెట్టి రెండు రోజులకు గా 1300 రూపాయలు చెల్లించినట్లుగానే చెల్లించాలని నినాదాలు చేశారు.
రెండు పూటల భోజనానికి 500 రూపాయలా ?
మున్సిపల్ ఎన్నికల లో విధులు నిర్వహించిన ఓపిఓలకు రెండు పూటలా భోజనం ఒక పూట టిఫిన్ సౌకర్యాలు కల్పించి పంపించవలసిన అధికారులు కొర్రీలు పెడుతూ మొదటి రోజు ఒక పూట భోజనం రెండవ రోజు ఒకపూట భోజనం పెట్టి చేతులు దులుపుకుంటున్నారని వాపోయారు. 800 రూపాయలు వద్దని 1300 రూపాయలు కావాలని ధర్నాకు దిగారు. రెండు రోజులగా రెండు పూటల భోజనానికి 500 రూపాయలు కట్ చేయడం ఎక్కడా లేదని నిరసన వ్యక్తం చేశారు
