Dharmasagar | సేవ చేసే ఛాన్స్ ఇవ్వండి..

Dharmasagar | సేవ చేసే ఛాన్స్ ఇవ్వండి..

Dharmasagar, ఆంధ్రప్రభ : ఎన్నికల్లో గెలిపించి ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వండని కొట్టె భానుచందర్ అన్నారు. ధర్మసాగర్ గ్రామం, నాలుగో వార్డు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న భానుచందర్ జోరుగా ప్రచారం చేస్తూ విజయం పట్ల విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రచారంలో జోరు పెంచి ప్రత్యర్థుల కంటే ఒక అడుగు ముందున్నారు. గత ఆరు సంవత్సరాలుగా గ్రామంలోని విద్యార్థులకు నిస్వార్థంగా సేవలు అందిస్తున్న భానుకు వార్డులో పార్టీలకు అతీతంగా ప్రజల నుండి మద్దతు లభిస్తుంది. సామాజిక బాధ్యతగా సుమారు 300 మందికి పైగా విద్యార్థులకు బాక్సింగ్, కరాటే, హ్యాండ్‌బాల్ తో సహా పలు క్రీడల్లో ఉచిత శిక్షణను అందించాడు. యువకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు భానుచందర్ సేవలను ప్రశంసిస్తూ నాలుగో వార్డులో స్వచ్చందంగా భానుచందర్ కు మద్దతు ఇస్తున్నారు.

గ్రామంలోని పలువురు యువకులకు ఇచ్చిన శిక్షణతో క్రీడాకారులు, కానిస్టేబుళ్లు, టీచర్లుగా ఆయా రంగాల్లో రాణిస్తున్నారు. యువత ఆసక్తి వున్న అంశంలో నైపుణ్యం పెంపొందించడం, శారీరక దృఢత్వం, ఆత్మవిశ్వాసం పెంచడం ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా భాను తెలిపారు. వృతిరీత్యా పిఇటి ఉపాధ్యాయుడైన గ్రామ అభివృద్ధికి నడుంబిగించినట్లు తెలిపారు. గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే.. మరింత విస్తృతంగా సేవ చేసే అవకాశం నాకు లభిస్తుంది. గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికి నేను కృషి చేస్తాను అని అన్నారు. గ్యాసు పొయ్యి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ, గ్రామంలో ఆయన చేసిన పనులకు ఓటర్ల నుండి సంపూర్ణ మద్దతు లభిస్తుందని విశ్వాసంతో ఉన్నాడు.

Leave a Reply