ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు – 17 (ఆడియోతో…)

శ్రీరంగరాజస్థవమ్‌లోని ఋషి ప్రబోధం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ….

వటదల మధిశయ్య రంగధామ
శయిత ఇవార్ణవ తర్ణక: పదాబ్జమ్‌
అదిముఖ ముదరే జగన్తి మాతుమ్‌
న్యదధిధ వైష్ణవ భోగ్య లిప్సయావా

శ్రీరంగనాధుడు అనగా శ్రీమన్నారాయణుడు, సంసార సాగరాన్ని ధాటించే వాడు. ప్రళయ కాలంలో చిన్న మఱ్ఱి ఆకు పై పడుకొని తన పాదమును నోటిలో పెట్టుకొని ఉన్నాడు. దీనికి కారణం తన కడుపులో ఉన్న లోకాలను ఎన్నడుగులు ఉందో కొలవడానికా లేక ఆ కడుపులో లోకాలలో ఉన్న తన భక్తులకు తన పాదమకరంద రసాన్ని అందించడానికా?

పరమాత్మ ఏపని చేసినా బహుళార్ద సాధకముగా ఉంటుంది. ప్రళయ కాలంలో సముద్రం మీద ఒ చిన్న మఱ్ఱి ఆకు మీద పడుకొని తన పాదాన్ని నోటిలో పెట్టుకొని ఉండటానికి కారణం తన కడుపులో ఉన్న లోకాలు ఎంత విశాలంగా ఉన్నాయో తన అడుగుతో ఎన్ని అడుగులు ఉన్నాయో కొలవాడానికి అయ్యిండచ్చు లేదా తన కడుపులోని జగత్తులో ఉన్న తన భక్తులకు తన పాద మకరంద రసాన్ని అనుభవింప చేయడానికి అయ్యి ఉంటుం దని ఒక కవి భక్తుడు అభివర్ణించాడు.

క్షణం కూడ విడిచి ఉండలేని భక్తుల కోసమే పరమాత్మ ఈ లోకంలో అవతరించేది. పరిత్రాణాయ సాధూనాం అన్న దానికి అర్ధం ఇదే. సాధు జనుల రక్షణ అంటే వారికి కలిగే ఆపదలను తొలగించడం. నిజమైన ఆపద భగవంతుని పాదాలకు దూరం కావడమే. అందుకే ప్ర ళయంలో కూడా స్వామి తన భక్తులకు తన పాదాలను దూరం చేయడు. అందుకే మఱ్ఱాకు మీదున్న తన పాద రసాన్ని భక్తలకు అందించడానికే స్వామి తన పాదాన్ని నోటిలో పెట్టుకున్నాడు. ఇది ఎంత మధురమైన భావన. పరమాత్మ దయ, స్వభావం ఈ శ్లోకంలో వ్యక్తం అవుతుంది.

–శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *