ధర్మం – మర్మం

గంగా ఆవిర్భావ వృత్తాంతములో భగీరధునిపై శంకరుని అనుగ్రహం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

బాల భగీరధుని ముద్దు మాటలకు మురిసిన శంకరుడు అతని ముందు ప్రత్యక్షమై నీ శ్రద్ధ, దీక్ష, పట్టుదలకు, పితృభక్తికి, పరోపకార వాంఛకు, ని ష్కపటత్వానికి సంతోషించాను కావున వరమును కోరుకోమనెను. దేవతలకు కూడా లభించని దానిని నీకు ప్రసాదించెదని నిర్భయముగా ఏమి కావాలో కోరుకోమనగా పరమానంద భరితుడైన భగీరధుడు శంకరునికి నమస్కరించి నీ జటలలో ఉన్న నదీ శ్రేష్ఠయిన గంగను తన ప్రపితామహులు పరిశుద్ధులగుటకు ప్రసాదించమని ప్రార్థించెను. భగీరధుని కోరికను అంగీకరించిన శంకరుడు తన జట నుండి గంగ బయటకు వచ్చుటకు స్తోత్రము చేయమని చెప్పెను. భగీరధుడు గంగ కొరకు గొప్ప తపమును ఆచరించి స్తోత్రము చేసెను. అతని బాలచేష్టలకు, భక్తి ప్రపత్తులకు సంతసించిన గంగ అతనికి ప్రసన్నురాలయ్యెను. ఈ విధంగా మహేశ్వరుని వల్ల లభించిన గంగను తీసుకుని భగీరధుడు రసాతలమునకేగెను. అచట ఉన్న కపిల మహర్షికి జరిగినదంతా నివేదించి శాస్త్ర విధితో గంగను అవత రింప చేసి ఆ గంగకు ప్రదక్షిణము చేసెను.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *