ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు – 7 (ఆడియోతో…)

భాగవతం , అష్టమ స్కందంలోని ఋషి ప్రభోదం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ….

యదృచ్ఛా లాప తుష్టస్య తేజో విప్రస్య వర్ధతే
తత్ప్రసామ్యత్య సంతోషాత్‌ అంభసే వాశుశుక్షణి:

దైవం ప్రసాదించిన దానితో సంతోషించు బ్రాహ్మణునికి తేజస్సు పెరుగుతుంది. అదే బ్రాహ్మణుడు తృప్తి పొందనిచో నీరు నిప్పును చల్లార్చినట్లు తేజస్సును చల్లార్చును.

కోరికలు, అసంతృప్తి లేని బ్రాహ్మణుడు తాను ఆచరించవలసిన సంధ్యా వందనము, అగ్నిహోత్రము, తపస్సు భగవంతుని సేవగా ఆచరిస్తాడు. అలాంటి వారికి స్వార్థం, ఆశ, తాపము, లోభము లేవు కావున తపోయజ్ఞ క్రియలు తేజస్సును పెంచుతాయి. అదే దొరికిన దానితో తృప్తి పొందనివారు ఇంకా కావాలంటూ తహతహలాడుతూ తాను చేసే తపోయజ్ఞ క్రియలతో తమ అభీష్టాన్ని సాధించుటకు ప్రయత్నిస్తారు. స్వార్థపరులై ఆచరించిన తపోయజ్ఞక్రియలు కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగబడతాయి కానీ తేజస్సును పెంచవు. వీరిలో ఉన్న తేజస్సును కూడా అసంతృప్తి చల్లారుస్తుంది. అనగా తపోయజ్ఞ క్రియలు భగవంతుని సేవ కోసమే కానీ కోరికలను పొందడానికి కావు.

–శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *