Dhanush Marriage | అసలు నిజం ఇదే..

Dhanush Marriage | అసలు నిజం ఇదే..
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కోలీవుడ్ స్టార్ ధనుష్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్.. వీరిద్దరూ లవ్ లో ఉన్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. అలా ప్రచారం జరిగిన ప్రతిసారీ.. మేము ఫ్రెండ్స్ మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చేవారు. తాజాగా ధనుష్, మృణాల్ పెళ్లి చేసుకోబోతున్నారని ఓ న్యూస్ వైరల్ అయ్యింది. దీంతో ఇది నిజమా…? లేక గాసిప్పా అనే చర్చ మొదలైంది. ఇప్పుడు ఈ వార్తల పై క్లారిటీ వచ్చేసింది. ఇంతకీ.. ఈ వార్త వెనకున్న వాస్తవం ఏంటి..?

ధనుష్, మృణాల్ ఇద్దరూ లవ్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే.. మృణాల్ నటించిన సినిమా ఫంక్షన్స్ కు ధనుష్ వెళ్లడంతో ప్రచారంలో ఉన్నది నిజమే.. ఇద్దరూ లవ్ లో ఉన్నారని మరింతగా న్యూస్ వైరల్ అయ్యింది. ఇప్పుడు సీక్రెట్ గా పెళ్లి చేసుకోబోతున్నారని.. ఫిబ్రవరి 14న ఈ జంట పెళ్లితో ఒక్కటి కాబోతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తు ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలు గత రెండు మూడు రోజులు నుంచి జరుగుతున్నా.. ధనుష్ కానీ.. మృణాల్ కానీ.. రియాక్ట్ కాలేదు. దీంతో నిజమే అవ్వచ్చు లేకపోతే రియాక్ట్ అయ్యుండేవారు అని టాక్ వినిపిస్తోంది.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. మృణాల్ టీమ్ స్పందించింది. జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. ఇదంతా ఊహాగానాలే అంటూ తేల్చేసింది. ఫిబ్రవరిలో మృణాల్ నటించిన సినిమా రిలీజ్ ఉందని, మార్చిలో మరో ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని గుర్తు చేసింది. సినిమాలతో ఇంత బిజీగా ఉన్న మృణాల్ ఇప్పుడు పెళ్లి చేసుకునే ఆలోచనలో లేదని క్లారిటీ ఇచ్చింది. దీంతో ఇన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది.

