చేవెళ్ల బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన డీజీపీ
చేవెళ్ల : ఆర్టీసీ బస్సు ప్రమాద స్థలమైన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మిర్జాగూడ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivdhar Reddy) మంగళవారం పరిశీలించారు. ప్రమాదం ఏ విధంగా జరిగిందనేది స్థానిక పోలీస్ అధికారులు, ప్రత్యక్ష సాక్షులు ఆయనకు తెలియజేశారు. ప్రమాదానికి కారణమైన రోడ్డుపై గోతిని పోలీసులు క్రితం రోజే పూడ్చి వేయించారు. ఆ స్థలాన్ని సైతం ఆయన నిశితంగా పరిశీలించడం జరిగింది.

అక్కడి నుంచి నేరుగా చేవెళ్ల పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. స్టేషన్ ఆవరణలో గల సిఐ క్వార్టర్ కు వెళ్లారు. క్రితం రోజు సహాయక చర్యలు చేపడుతుండగా సీఐ భూపాల శ్రీధర్ కు కాలుకు రక్తగాయమైంది. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ఏ విధంగా చేపట్టారు, తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందని సీఐని అడిగారు. మెరుగైన వైద్య సేవలు చేయించాలని స్థానిక పోలీసు ఉన్నతాధికారులకు ఆయన సూచించారు. తగినంత విశ్రాంతి తీసుకోవాలని సిఐకి తెలిపారు.

