న్యూఢిల్లీ : అహ్మదాబాద్(Ahmedabad)లో AI 1717 విమాన ప్రమాదం నేపథ్యంలో.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరిస్తూ, ఎయిర్ ఇండియా (Air India) మంగళవారం కీలక ప్రకటన చేసింది.
తమ బోయింగ్ 787లు, బోయింగ్ 737 విమానాలన్నింటిలోనూ ఫ్యుయల్ కంట్రోల్ స్విచ్ (FCS) లో లాకింగ్ మెకానిజంపై జాగ్రత్త తనిఖీలు పూర్తి చేసినట్టు తెలిపింది. ఈ తనిఖీలలో ఎలాంటి సమస్యలు లేవని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.
ఎయిర్ ఇండియా వద్ద మొత్తం 33 వైడ్ బాడీ బోయింగ్ 787లు ఉన్నాయి. తక్కువ ధర చార్జీలు వసూలు చేసే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వద్ద సుమారు 75 న్యారో బాడీ బోయింగ్ 737లు ఉన్నాయి. బోయింగ్ 737 విమానాలను ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ మాత్రమే నడుపుతోంది.