Devotional | తిరుమల శ్రీవారి సేవలో మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవీస్
తిరుమల – మహారాష్ట్ర ముఖ్యమంత్రి ,బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ నేడు తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కుటుంబసభ్యులతో, సహచరులతో కలిసి తిరుమలకు వెళ్లిన ఫడ్నవీస్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశంలోని ప్రముఖ ఆలయాల్లో తిరుపతి వేంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఒకటని అన్నారు. ఇవాళ తిరుమలకు వచ్చి వేంకటేశ్వర స్వామిని దర్శంచుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.