శివాలయాల్లో భక్తుల తాకిడి..

శివాలయాల్లో భక్తుల తాకిడి..
సూర్యాపేట జిల్లా మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి శివాలయాల్లో కార్తీకమాసం ఆదివారం రోజున భక్తుల తాకిడి పెరిగింది. హైదరాబాద్, విజయవాడతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భక్తులు తరలిరావడంతో దేవాలయాల్లో సందడి వాతావరణం నెలకొంది. సోమవారం (10 వ తేదీ) న 365 కేజీల విభూతి అభిషేకం జరుగుతుందని, ఇంకా భక్తులు తీసుకొచ్చిన విభూతిని కూడా స్వీకరించి అభిషేకం చేస్తామని ఈరోజు రాత్రి 8 లోపు గాని, ఉదయం అభిషేకం చేసే లోపు దేవాలయాల్లో అందజేయాలని నిర్వాహకులు తెలియచేశారు.
