విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు..
వర్గల్, ఆంధ్రప్రభ : అమ్మవారి జన్మ నక్షత్రం, మూల నక్షత్రo పురస్కరించుకొని శ్రీ విద్యాధరి(Shri Vidyadhari) క్షేత్రంలో ఈ రోజు వేద పండితులు విశేష పూజలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి తెల్లవారు జామున విశేష పంచామృతాభిషేకం, ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు, చండీ హోమం, లక్ష పుష్పార్చన(hundred thousand flowers) తదితర ఘనంగా జరిగాయి.
ఆలయ వ్యవస్థాపక చైర్మన్ బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి(Brahmashri Yayavaram Chandrasekhara Sharma Siddhanthi) నేతృత్వంలో ఏర్పాట్లు జరగగా, విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థప్రసాదాలతో పాటు మహాప్రసాదం అందజేశారు.

