విదేశీ డాలర్లు సమర్పించిన భక్తులు…

విదేశీ డాలర్లు సమర్పించిన భక్తులు…

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : అమ్మలు గన్న అమ్మ ఆ ముగ్గురు అమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మకు కానుకల వర్షం కురిసింది. విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మవారిని రాష్ట్రం నలుమూలలతో పాటు దేశ విదేశాల నుండి దర్శనానికి వస్తున్న భక్తులు అమ్మవారికి భక్తితో నగదు, బంగారం వెండితో పాటు విదేశీ కరెన్సీని సైతం కానుకగా అందిస్తున్నారు.

ఈ నేపథ్యంలో గడిచిన 20 రోజులకు గాను హుండీల లెక్కింపును ఆలయ కార్యనిర్వహణాధికారి శీనా నాయక్ పర్యవేక్షణలో సోమవారం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని మహా మండపం 6వ అంతస్తులో దేవస్థానం అధికారులు సిబ్బంది దేవాదాయశాఖ అధికారులు పలువురు సేవకులు దేవస్థానం 44 కుండీలలోని 167 సంచులను లెక్కించారు.

ఈ హుండీ లెక్కింపు సందర్భంగా నగదు రూ. 4,33,85,655/-,బంగారం 420 గ్రాములు, వెండి 6 కిలోల 614 గ్రాముల 4 మిల్లీగ్రాములను భక్తులు అమ్మవారికి కానుకగా సమర్పించారు.

అలాగే విదేశీ భక్తులు యు.ఎస్.ఎ డాలర్లు 582, సింగపూర్ డాలర్లు 22,కెనడా డాలర్లు 215, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్స్ 485, సౌదీ రియాల్స్ 15, ఒమన్ బైసా 1, ఖతార్ రియాల్స్ 18, మలేషియా రింగిట్ 23,యూరోప్ యూరోలు 15, కువైట్ దీనార్ 2 ¼, ఆస్ట్రేలియా డాలర్లు 250, ఇంగ్లాండ్ పౌండ్లు 15 భక్తితో జగన్మాతకు బహూకరించారు.

ఈ లెక్కింపు ప్రక్రియను ఆలయ ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ , ట్రస్ట్ బోర్డు సభ్యులు సుకాసి సరిత, టి.రమాదేవి, పద్మావతి ఠాకూర్, కళావతి, రాఘవరాజు, హరికృష్ణ పరిశీలించారు.

Leave a Reply