Devotees | దేవరకోట ఆలయంలో కంకణధారణ

Devotees | దేవరకోట ఆలయంలో కంకణధారణ

Devotees | నిర్మల్ రూరల్, ఆంధ్రప్రభ : శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం దేవరకోట ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా నేడు ఐదవ రోజు.. శ్రీరామ కన్నాన్ ఆచార్యుల ఆధ్వర్యంలో కంకణధార‌ణ‌ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రవచనాలతో ఆలయంలో ఉదయం ఐదు గంటల 30 నిమిషాల నుండి తిరుప్పావై ఐదవ రోజు పాశురం చదివి దాని విలువ భక్తులకు (Devotees) తెలియజేసి స్వామి వారికి మహా హారతి అందించి… శనివారం పురస్కరించుకొని స్వామివారి పల్లకిసేవ శ్రీవారి మాడవీధుల గుండా అతిపెద్ద సంఖ్యలో భక్తుల నడుమ కొనసాగింది.

గోవింద (Govinda) నామస్మరణతో ఆలయం దద్దరిల్లింది. ఈరోజుటి ప్రత్యేకత ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకొని 11 రోజులు, తొమ్మిది రోజులు, ఏడు రోజుల కంకణ ధారణ మహోత్సవాన్ని ఆలయ పూజారి శ్రీ రామ కన్నన్ వచ్చిన భక్తులకు కంకణ‌ధారణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కంకణధారణ ముక్కోటి ఏకాదశి 30వ తేదీ వరకు భక్తులు ధరించి స్వామివారి అనుగ్రహం పొందాలని వారు తెలిపారు. అదేవిధంగా కంకణ ధారణ ధరించిన భక్తులకు పసుపు కండువా వేసి ఆశీస్సులు అందించారు. నిర్మల్ పట్టణం మొత్తం పసుపుమయం, గోవింద నామస్మరణతో మార్మోగాలని నూతన చైర్మన్ ఆమేడ శ్రీనివాస్ కోరారు.

Leave a Reply