Devi sri prasad | దేవిశ్రీ హీరోగా రాణించేనా…?

Devi sri prasad | దేవిశ్రీ హీరోగా రాణించేనా…?

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బలగం సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ సినిమాతో కమెడియన్ వేణు కాస్తా.. బలగం వేణు అయ్యాడు. చిన్న సినిమాగా రిలీజైన బలగం.. బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించింది. అయితే.. వేణు నెక్ట్స్ మూవీ ఎల్లమ్మ అని ఎప్పుడో ప్రకటించారు. ఇప్పుడు సంక్రాంతికి ఎల్లమ్మ సినిమాని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే.. ఇందులో దేవిశ్రీప్రసాద్ హీరోగా నటిస్తుండడం విశేషం. అనౌన్స్ మెంట్ వీడియోతో డీఎస్పీ షాక్ ఇచ్చాడు. మరి.. డిఎస్పీ హీరోగా రాణించేనా..?

Devi sri prasad | ఆ ప్రచారమే నిజం అయ్యింది..

Devi sri prasad

ఎల్లమ్మ కథ ముందుగా నానికి చెప్పడం జరిగింది. కథ బాగుంది కానీ.. వేరే ప్రాజెక్టుల్లో బిజీగా ఉండడం వలన సున్నితంగా నో చెప్పాడు. ఆతర్వాత నితిన్ తో ఫిక్స్ అనుకున్నారు. అయితే.. నితిన్ వరుసగా ఫ్లాపుల్లో ఉండడంతో.. సెట్ కాలేదు. విశ్వక్ సేన్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్.. ఇలా చాలా మంది హీరోల దగ్గరకు ఈ కథ వెళ్లింది. ఆఖరికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ తో ఫిక్స్ అయ్యిందని గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఆ ప్రచారమే నిజం అయ్యింది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాని ప్రకటించారు.

Devi sri prasad | జానపద కళాకారుడుగా డిఎస్పీ..

ఇక అనౌన్స్ మెంట్ వీడియో విషయానికి వస్తే.. ఈ వీడియోలో దేవి చాలా షాకింగ్ లుక్ లో దర్శనమిచ్చాడు. పొట్టేలు, గజ్జెల మువ్వలతో శబ్దం చేస్తూ, భుజానికి డప్పు కట్టుకుని, కాలికి రక్తం కారుతున్నా, పరుగులు పెడుతున్న ఒక యువకుడి పాదాలను రివీల్ చేస్తూ చివరిలో డిఎస్పీ ఫేస్ ని సైడ్ కట్ నుంచి పరిచయం చేశారు. గ్రామ దేవత బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఎల్లమ్మలో దేవి జానపద కళాకారుడిగా నటించబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఈ వీడియో చూస్తే.. అదే కనిపిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తే సినిమా తీస్తానని సుకుమార్ ఎప్పుడో ప్రకటించారు. ఇప్పుడు ఇలా కుదరింది.

Devi sri prasad | ఒక ప్రయోగమే..

Devi sri prasad

మ్యూజిక్ డైరెక్టర్స్ హీరోలుగా నటించడం ఇప్పటి తరంలో ఒకరిద్దరు తప్పా ఎవరూ చేయలేదు. మణిశర్మ, రెహమాన్, కీరవాణి, ఇళయరాజా, దేవా, ఎస్ఏ రాజ్ కుమార్, తమన్ వీళ్ళందరూ ఎన్నో గొప్ప ఆల్బమ్స్ ఇచ్చారు కానీ.. హీరోగా నటించలేదు. ఇప్పుడు దేవిశ్రీ హీరోగా ఎంట్రీ ఇస్తుండడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇది ఒక ప్రయోగమే. మ్యూజిక్ డైరెక్టర్ గా బిజీగా ఉన్నప్పటికీ ఈ సినిమా చేస్తుండడంతో ఎలా ఉండబోతుంది.? డిఎస్పీ హీరోగా రాణిస్తాడా..? లేదా..? అనేది ఆసక్తిగా మారింది. మరి.. దేవిశ్రీ ఎంత వరకు మెప్పిస్తాడో చూడాలి.

CLICK HERE TO READ రఫ్పాడిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

CLICK HERE TO READ MORE

Leave a Reply