Development | మండెలగూడెం గ్రామాభివృద్ధికి కృషి చేస్తా..

Development | మండెలగూడెం గ్రామాభివృద్ధికి కృషి చేస్తా..
- -ఎమ్మెల్యే కడియం శ్రీహరి
Development | రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : మండెలగూడెం గ్రామ అభివృద్ధికి తనవంతు సహాయ సహాకారాలు అందిస్తానని స్టేషన్ ఘనపూర్ అభివృద్ధి ప్రదాత మాజీ ఉపముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి(MLA Kadiyam Srihari) అన్నారు.
ఈ రోజు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, లింగాల జగదీశ్ రెడ్డి, యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బోనసి క్రాంతి కుమార్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కోళ్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో ఇటీవల గ్రామపంచాయితీ ఎన్నికల్లో మండెలాగూడెం గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన రాజశేఖర్ డ్యాగల, గ్రామ వార్డు సభ్యులు హన్మకొండలోని ఎమ్మెల్యే కడియం శ్రీహరిని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి ఆశీస్సులు తీసుకున్నారు.
ఈసందర్భంగా నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. గ్రామం అభివృద్ధి(Development)కి తమ సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ ఫార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
