గ్రామాల అభివృద్ధి.. ప‌నుల నాణ్య‌త‌పై దృష్టి..

గ్రామాల అభివృద్ధి.. ప‌నుల నాణ్య‌త‌పై దృష్టి..

కడెం, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) తోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు అన్నారు. ఆదివారం కడెం మండలం సారంగాపూర్ గ్రామంలో రూ.12లక్షలతో అంగన్వాడీ కేంద్ర భవన నిర్మాణానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం గ్రామంలో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్లు(CC roads), డ్రైనేజీ ప‌నులను ఎమ్మెల్యే పరిశీలించారు. డ్రైనేజీ నిర్మాణం(Drainage construction) పనులు నాణ్యత కలిగి ఉండేలా చూడాలని అధికారులు పర్యవేక్షించాల‌ని అన్నారు.

అనంతరం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, వీడీసీ సభ్యులు గ్రామస్తులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బోజ్జు కు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఆయన వెంట ఖానాపూర్ ఏ ఎంసీ చైర్మన్ పడిగల భూమన్న భూషణ్, వైస్ చైర్మన్ మజీద్, ఆత్మ కమిటీ చైర్మన్ జి సత్యనారాయణ, కడెం మండల తాహసిల్దార్ ఆర్ ప్రభాకర్, ఖానాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం, యూత్ కాంగ్రెస్ కడెం మండల అధ్యక్షుడు రేంకల శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కోల శ్రీనివాస్, మార్కపు లక్ష్మణ్, కుమ్మరి భూమన్న, ఆకుల లచ్చన్న, ముసుకు రాజేందర్ రెడ్డి, గొల్ల వెంకటేష్ బొడ్డు గంగన్, మొహమ్మద్ సలీం, కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు కుమ్మరి సుధాకర్ నాయకులు కోల చిన్న నరసయ్య, కుమ్మరి రమేష్, మాదాసు పెద్ద రాజన్న గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply