అభివృద్ధి మా మా వంతు.. గెలుపు మీ వంతు – బీఆర్ఎస్ అభ్యర్థి కూరేళ్ల పద్మ పరమేష్‌..

అభివృద్ధి మా మా వంతు.. గెలుపు మీ వంతు – బీఆర్ఎస్ అభ్యర్థి కూరేళ్ల పద్మ పరమేష్‌..

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీలోని 12వ వార్డు అభివృద్ధి మా వంతు.. గెలుపు మీ వంతు అని బీఆర్ఎస్ అభ్యర్థి కూరెళ్ళ పద్మ పరమేశులు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. రేపు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో తమను గెలిపించాలని విన్నవిస్తున్నారు.

కౌన్సిలర్ గా ఒక్కసారి అవకాశం ఇచ్చి తమను గెలిపిస్తే.. మోత్కూర్ మున్సిపాలిటీలో ప్రశ్నించే గొంతుకనై.. నీతి, నిజాయితీతో సేవలందిస్తామని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటామని.. అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని విజ్ఞప్తి చేస్తున్నారు. వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాల్, వీధి దీపాలు, విద్యుత్ స్తంభాలు, త్రాగునీటి శాశ్వత పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పన కోసం అహర్నిశలు కృషి చేస్తామని.. తమకు ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుతూ చేతులు జోడించి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply