అభివృద్ధి మా బాధ్యత.. బీఆర్ఎస్ కి పట్టం కట్టండి – బీఆర్ఎస్ అభ్యర్థి కొండ శోభ సోoమల్లు

అభివృద్ధి మా బాధ్యత.. బీఆర్ఎస్ కి పట్టం కట్టండి – బీఆర్ఎస్ అభ్యర్థి కొండ శోభ సోoమల్లు

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప 4 వ వార్డులో అభివృద్ధి మా బాధ్యతని.. ఒక్కసారి అవకాశం ఇచ్చి కౌన్సిలర్ గా గెలిపించాలని కోరుతూ సోమవారం బీఆర్ఎస్ అభ్యర్థి కొండ శోభ సోoమల్లు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. గత 10 ఏండ్ల బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని మోత్కూర్ మున్సిపాలిటీలో మాజీ ఎమ్మెల్యే కిషోర్ కుమార్, మంజూరు చేసిన రూ.20 కోట్లతోనే.. ప్రస్తుత ఎమ్మెల్యే అభివృద్ధి పనులు చేపట్టారని, ప్రజలు గమనించి ఎల్లుండి జరిగే ఎన్నికల్లో కారు గుర్తు పై అధిక ఓట్లు వేసి మమ్మల్ని కౌన్సిలర్ గా గెలిపిస్తే.. వార్డులోని అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామని, నీతి, నిజాయితీగా పాలన అందిస్తామని.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటామని విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply