Development | సర్పంచ్‌ను సన్మానించిన పూర్వ విద్యార్థులు

Development | సర్పంచ్‌ను సన్మానించిన పూర్వ విద్యార్థులు

Development | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని తీప్రాస్ పల్లి సర్పంచ్ గా విజయలక్ష్మి నరసింహులు గెలుపొందడం తో, 2004 పదో తరగతి పూర్వ విద్యార్థులు ఈ రోజు ఘనంగా సన్మానించి అభినందించారు. ప్రజలు ఆదరించి అభిమానంతో గెలిపించారని ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేయడంతో పాటు గ్రామ అభివృద్ధికి(development) పాటుపడాలని బాల్యమిత్రులు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ విజయలక్ష్మి నరసింహులు మాట్లాడుతూ ప్రజలు తనపై ఎంతో నమ్మకంతో గెలిపించారని సేవ చేసి వారి రుణం తీర్చుకుంటామని అన్నారు. పదో తరగతి పూర్వ విద్యార్థులు(students) సన్మానించి అభినందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్సి పూర్వ విద్యార్థులు కిరణ్, శంకర్, అశోక్, సంగమేష్, బన్నేష్, భీమ్ రాజ్, రవి, సీతారాం గౌడ్, తిమ్మప్ప, వెంకట్ రావు, రాహు గణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply