Development | మురికి కాలువను జేసీబీతో తొలగింపు

Development | మురికి కాలువను జేసీబీతో తొలగింపు
Development | రెంజల్, ఆంధ్రప్రభ : రెంజల్ మండలం సాటాపూర్ గ్రామంలో హనుమాన్ మందిరం నుండి పెద్ద చెరువు వరకు పేరుకుపోయిన మురికి కాలువను జెసిబీ సహాయంతో శుభ్రం చేశారు. గత 12 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో చేయలేని అభివృద్ధి పనులు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు,స్థానిక ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు, స్థానిక సర్పంచ్ లచ్చావార్ సుహాసిని ఆధ్వర్యంలో శుభ్రం చేయించారు.
సర్పంచుల ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నెరవేర్చడం జరిగిందని అన్నారు. ఓబిసి మండల అధ్యక్షుడు లచ్చావార్ నితిన్, కురుమ సంఘం మండల అధ్యక్షుడు కురుమే సాయిలు, గ్రామ కమిటీ అధ్యక్షుడు కంఠం గంగారం, కార్యదర్శి మహబూబ్ అలీ, వార్డు సభ్యులు గోసం గంగాధర్, దెబ్బడా రాజు, సభావాత్ అశోక్, దండు అనిల్, దేవీలాల్ లక్ష్మణ్, చాకలి భూమయ్య సిబ్బంది పాల్గొన్నారు.
