పూలే ఆశయాలకు అనుగుణంగానే చంద్రబాబు పాలన

పూలే ఆశయాలకు అనుగుణంగానే చంద్రబాబు పాలన

రాప్తాడు, ఆంధ్రప్రభ : మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో పాలన సాగుతోందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. టిడిపి క్యాంప్ కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే టిడిపి నాయకులు ఎస్సీ సెల్ నాయకులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు కూడా చదువుకోవాలని తొలిసారి ఉద్యమించింది పూలే అని గుర్తు చేశారు.

మహిళలు చదువుకుంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని భావించి తన సతీమణి సావిత్రి బాయి పూలేను చదవించారన్నారు. బాలికల కోసం మొట్టమొదటిసారిగా పాఠశాల స్థాపించిన వ్యక్తి పూలే అన్నారు. సమాజంలో రుగ్మతలపై పోరాడటమే కాకుండా దళిత బడుగు వర్గాల హక్కుల కోసం ఎంతో తపన పడ్డారన్నారు. అలాంటి మహానీయుని స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి నుంచి మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారన్నారు.

మహిళల కోసం పూలే ఆరాటపడితే మహిళల్ని ఆర్థికంగా చైతన్యం చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలకు నేటికీ ప్రధాన్యమిస్తున్నది ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమేనని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు మండల కన్వీనర్ పంపు కొండప్ప ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శ్రీనివాసులు రాప్తాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ సుధాకర్ నాయుడు ఎస్సీ సెల్ హిందూపురం పార్లమెంటు అధికార ప్రతినిధి రొద్దం ముత్యాలప్ప క్లస్టర్ ఇన్చార్జిలు సోమరనారాయణ స్వామి సిసి రాము మహిళలు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply