సీసీ రోడ్డు పనులకు భూమిపూజ…

సీసీ రోడ్డు పనులకు భూమిపూజ…

బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో మంగళవారం ఈజిఎస్ నిధులు రూ.10 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సర్పంచ్ ఎర్రల జానకిరాజు ఆధ్వర్యంలో భూమిపూజ నిర్వహించారు. ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు వారు పేర్కొన్నారు.

గ్రామ అభివృద్ధికి సీసీ రోడ్డు నిర్మాణం ఎంతో ఉపయోగపడుతుందని స్థానిక నాయకులు తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో రాకపోకలు సులభతరం అవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు రత్నాకర్ రెడ్డి, గ్రామ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply