Development | ఆశీర్వదిస్తే… ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా…

Development | ఆశీర్వదిస్తే… ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా…

కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఈదులకంటి ఐలయ్య

Development | జనగామ ప్రతినిధి, ఆంధ్రప్రభ : పెద్ద పహాడ్ గ్రామ ప్రజలు ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఉంగరం గుర్తుకు ఓటేసి ఆశీర్వదించి గెలిపిస్తే.. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దుతాన‌ని సర్పంచ్ అభ్యర్థి ఈదుల కంటి ఐలయ్య అన్నారు. ఇవాళ‌ జనగామ మండలంలోని పెద్దపహాడ్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింట ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించారు.

ఈసందర్భంగా అభ్యర్థి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన త‌న‌ను సర్పంచ్ ఎన్నికల్లో ఉంగరం గుర్తుకు అత్యధిక సంఖ్యలో ఓట్లు వేసి ఆశీర్వదిస్తే ప్రభుత్వ సహకారంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. ప్రజా సమస్యలు అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని ఆయన అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుండా శ్రీధర్ రెడ్డి, మాజీ ఎంపిటిసి కొమరయ్య, గొల్లపల్లి పరశురాములు, కార్యకర్తలు, ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply