మహిళ శక్తే ఈనాడు దేశ భవిష్యత్తు..

మహిళ శక్తే ఈనాడు దేశ భవిష్యత్తు..

డీటీసీ యం. పురేంద్ర

విజయవాడ, ఆంధ్రప్రభ : ప్రభుత్వ కార్యాలయల్లో పనిచేస్తున్న మహిళలు ఒకపక్క కుటుంబం రెండో పక్క ఉద్యోగ బాధ్యతలను నెరవేరుస్తూ నేటి సమాజానికి ఆదర్శంగా ఉంటున్నారని డీటీసీ యం. పురేంద్ర అన్నారు. స్థానిక బందరు రోడ్డులోని డీటీసీ కార్యాలయంలో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళ ఉద్యోగులతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డీటీసీ ఎం పురేంద్ర ముఖ్య అతిథులుగా హాజరైనారు.

ఈ సందర్భంగా డీటీసీఎం పురేంద్ర మాట్లాడుతూ మహిళల హక్కులు, మహిళా కార్మికులకు సమాన వేతనం, మెరుగైన పని పరిస్థితులు, ఓటు హక్కు మొదలగు వాటిపై ఆనాడు మహిళలు ఉద్యమాలు చెప్పట్టారని ఆయన అన్నారు. దాని ఫలితమే ఈనాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారని ఆయన తెలిపారు. మహిళలకు సమాన హక్కులు, సాధికారత, సమాజ అభివృద్ధిలో వారి పాత్రను గౌరవిస్తూ ప్రపంచవ్యాప్తంగా మహిళలను గౌరవించడం జరిగిందన్నారు.

కుటుంబానికి ఆదారంగా, సమాజానికి ఆదర్శంగా, దేశ అభివృద్ధికి శక్తిగా మహిళలు నిలుస్తున్నారని ఆయన కొనియాడారు. మహిళలను గౌరవించడం మన సమాజ పురోగతని, మహిళ శక్తే ఈనాడు దేశ భవిష్యత్తని ఆయన అన్నారు. అనంతరం మహిళా ఉద్యోగులకు సన్మానం చేసి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మహిళా ఉద్యోగులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు డిటిసి ఎం పురేంద్ర తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీవోలు పద్మావతి, ఆర్ ప్రవీణ్, ఎస్ వెంకటేశ్వరరావు, ఏపీ రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షులు ఎం రాజుబాబు, మోటార్ వాహన తనిఖీ అధికారులు పద్మాకర్, ఉదయ్, అలీ,, గీతాంజలి, ప్రియదర్శిని, దివ్య, కార్యాలయ పరిపాలన అధికారులు అబ్దుల్ సత్తార్, సత్యనారాయణ, లలిత, ఉష సుందరి, రిటైర్డ్ ఆర్టీఓ రాజారావు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave a Reply