development| పది లక్షలతో నిర్మించే గ్రామైక్య భవనానికి భూమి పూజ..

development| పది లక్షలతో నిర్మించే గ్రామైక్య భవనానికి భూమి పూజ..
development| సిర్పూర్, ఆంధ్రప్రభ: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలోని నెట్నూర్ గ్రామపంచాయతీ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామక్య సంఘం భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో భవన నిర్మాణానికి నేర్పూరు సర్పంచ్ మడావి లక్ష్మణ్ భూమి పూజ చేశారు. భవన నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించకుండా చూడాలని పనులు త్వరగా పూర్తిచేయాలని ఈ భవనం నిర్మాణంతో సంఘాల మహిళలకు సమావేశాలు నిర్వహించడానికి ఎంతో ఉపయోగపడుతుందని సర్పంచ్ మడావి లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నెట్నూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి గంప రాజు,వివో సంఘ సభ్యులు ఆత్రం రంభ బాయి, కినక రుక్మ బాయి, ఫీల్డ్ అసిస్టెంట్ మడవి బాధిరావు, వార్డ్ సభ్యులు మడవి బొజ్జిరావు, ఆత్రం లలిత, ఆడ బహదూర్ షా, గ్రామ పటేల్ మడవి శ్యాం రావు,ఆడ సోంజీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆత్రం శంకర్, సేద్మకి నాగోరావ్, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.
